అరబ్ దేశాలపై డబ్ల్యుటిఓలో కతార్ ఫిర్యాదు
- August 01, 2017
అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు వాణిజ్యపరంగా తనను బహిష్కరించడంపై కతార్ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)లో సోమవారం ఫిర్యాదు చేసిందని కతార్ డబ్ల్యుటిఓ కార్యాలయ డైరెక్టర్ అలీ అల్వలీద్ మీడియాకు తెలిపారు. ఆ మూడు దేశాలతో చర్చలు జరిపేందుకు కతార్ లాంఛనప్రాయంగా అభ్యర్థించింది. ఈ వాణిజ్య వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తీసుకున్న మొదటి చర్యలో భాగంగా ఆ మూడు దేశాలకు 60 రోజుల గడువును విధించింది. ఈలోగా తమ ఫిర్యాదును పరిష్కరించాలని, లేని పక్షంలో డబ్ల్యుటిఓలో వ్యాజ్యాన్ని, ప్రతీకార వాణిజ్య ఆంక్షలను ఎదుర్కొనాల్సి వుంటుందని హెచ్చరించింది. ఇచ్చిన హామీలకు అనుగుణంగా వారి చర్యలు వున్నాయా లేదా అనే విషయమై చట్టపరమైన వివరణలు ఇవ్వడానికి తాము తగినంత సమయం ఇచ్చామని అల్వలీద్ తెలిపారు. చర్చలు జరపడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని తాము నమ్ముతామని చెప్పారు. ఆ దేశాలు తీసుకున్న చర్యలపై మరింత సమాచారం తాము తెలుసుకోవాలనుకుంటున్నామని అన్నారు. తద్వారా ఈ వివాదానికి పరిష్కారాన్ని కనుగొనాలన్నారు.
కతార్‌ను బహిష్కరించడం వెనుక జాతీయ భద్రతే ప్రధాన కారణమని అరబ్‌దేశాలు డబ్ల్యుటిఓకు ఇంతకుముందే స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







