విజిట్ వీసా 10 నిమిషాల్లోనే
- August 02, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కేవలం పది నిమిషాల్లోనే విజిట్ వీసా జారీ చేసేందుకు వీలుగా కొత్త సిస్టమ్‌ని అందుబాటులోకి తెచ్చింది. నేషనల్స్‌కీ అలాగే రెసిడెంట్స్‌కి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 'ఇ ఛానల్స్' పేరుతో ఈ కొత్త సిస్టమ్‌ని పౌరులు, నివాసితులు, పోర్ట్స్ కోసం అందుబాటులోకి తెచ్చారు. స్మార్ట్ సర్వీసెస్ ఫ్యూచర్ విజన్ పేరుతో కొత్త సిస్టమ్‌ని తీసుకురాగా, అందులో రెసిడెన్సీ సర్వీసులు, వీసా సర్వీసుల్ని కూడా అందజేస్తారు. ఈ కొత్త విధానంతో వీసా సెంటర్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఆయా సేవల్ని పొందవచ్చు. అబుదాబీలో డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్ బ్రిగేడియర్ మన్సూర్ అహ్మద్ మాట్లాడుతూ, కొత్త విధానం వల్ల సర్వీస్ సెంటర్స్‌ని సందర్శించే కస్టమర్స్ 2018 నాటికి 80 శాతం వరకు తగ్గుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. టెస్ట్ రన్స్ సందర్భంగా పది నిమిషాల్లోపే ప్రక్రియ పూర్తవుతున్నట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







