రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
- August 05, 2017
అల్ గర్హౌద్ బ్రిడ్జ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని దుబాయ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు బ్రిడ్జిపైనున్న బ్యారియర్లను ఢీకొన్నాయి. మరో కారు కూడా ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యింది. మధ్యాహ్నం 12.30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుర్ దుబాయ్ వైపుగా వెళుతుండగా వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదంలో ఓ కారు పూర్తిగా ధ్వంసమయ్యిందని దుబాయ్ పోలీస్ అధికార ప్రతినిథి తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని దుబాయ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందించి మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







