జయశంకర్ 83వ జయంతి పురస్కరించుకొని మొక్కలు నాటిన బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్
- August 06, 2017
తెలంగాణా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి 83వ జయంతి వేడుకలను ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ అధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని అనంతరం ఆండాల్స్ గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మూడో విడత ఆకుపచ్చ హరితహారం రాష్ట్రానికి మణిహారంగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో దీనిని విజయవంతం చేసేందుకు టిఆర్ఎస్ నాయకులు బహరేన్ లో మొక్కలు నాటి హరితహారం నిర్వహించారు. అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతు జయశంకర్ సార్ మహోన్నతమైన వ్యక్తి అని సార్ సేవలను కొనియాడారు. ప్రతి సామాజిక అంశంపై పరిశీలన చాలా గొప్పగా ఉండేదని ఆయన చేసిన భావజాల వ్యాప్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నామని జయశంకర్ సార్ పిలుపుతో ఊరూరా కేసీఆర్‌లు తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపారని సార్ జయంతి వేడుకలను గల్ఫ్ దేశాలో జరుపుకోవడం సంతోషంగా ఉందనీ. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవిపటేల్ దెషెట్టి, జాయంట్ సెక్రెటరీలు సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ప్రమోద్ బోలిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









