యుఎఇలో మాధకద్రవ్యాల కోసం పోలీస్ 22 వెబ్సైట్లను నిషేధించిన పోలీసులు
- August 06, 2017
దుబాయ్: టీనేజ్ యువతకు మాదకద్రవ్యాలను ప్రోత్సహించడం మరియు విక్రయాలు జరుపుతున్న నేరానికి గాను 22 వెబ్సైట్లు రాస్ అల్ ఖైమా పోలీసులు మూసివేశారు. రాస్ అల్ ఖైమా పోలీస్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కొలొనెల్ అద్నాన్ అలీ అల్ జైబి మాట్లాడుతూ, యువతకు మాదకద్రవ్యాలను ప్రోత్సహించే అనుమానాస్పద వెబ్సైట్లను పోలిసులు నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఏడాది పొడవునా అనేక మంది మాదక ద్రవ్యాల సరఫరాదారులను అరెస్టు చేయడంలో సమాచారం అందించే వారు చేసిన సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి చట్టవిరుద్ధమైన వెబ్సైట్ల చేసే నేరాలను ఎదుర్కోవడానికి, పోలీసులు ఔషధ నియంత్రణ విభాగంలో ఒక ఎలక్ట్రానిక్ గస్తీ బృందాన్ని ఏర్పాటు చేశారు, యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) యొక్క సమన్వయం సైతం ఎంతగానో సహాయపడింది.అనేక సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పరిశీలనకు దారి తీసింది. "వివిధ రకాల మాదకద్రవ్యాలను ఎలా ఉపయోగించాలో యువకులు నేర్పించిన చాలా వెబ్సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి , బాధితులు సులభంగా మత్తుమందులకు అలవాటుపడటం మరియు మాదకద్రవ్యాలను కొనుక్కునేందుకు పలు అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా మరియు ఆన్లైన్ లో మాధకద్రవ్యాల వెబ్సైట్లను పరిశీలించే యువతను జాగ్రత్తగా గమనించాలని తల్లిదండ్రులు దుబాయ్ పోలీసులు హెచ్చరించారు దుబాయ్లోని అనేక మంది యువకులలో మాదక ద్రవ్యాల పట్ల బానిసలుగా మారినట్లు కనుగొన్నారు. దుబాయ్ పోలీస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత ఏడాది వివిధ మాదక ద్రవ్యాల కేసుల్లో చిక్కుకున్న వారిలో 62 శాతం మంది 15 నుంచి 25 ఏళ్ల వయస్సులో ఉన్నవారే అధికంగా ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







