నేడు రాఖీ పౌర్ణమి
- August 06, 2017
నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా.. లైఫ్‌స్టైల్ ఎంత మారుతున్నా సంప్రదాయాలకు పెద్దపీట వేసే దేశం మనది.. ఆప్యాయత, అనురాగాలు ముడివేసుకున్న మమతానుబంధాల లోగిళ్లు మనవి.. ఈ లోగిళ్లకు కొత్త శోభను తీసుకొచ్చింది శ్రావణ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు శుభసూచికంగా జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి.
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్ర మైనదిగా భావిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ రోజు రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. రక్షణ కోరిన స్త్రీకి రక్షాకవచంగా నిలుస్తానని అభయమివ్వడమే రాఖీ పండగ పరమార్థం. తనకు రక్షణగా నిలిచే సోదరుడు కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సోదరి కట్టే తోరమే రాఖీ. తన క్షేమం కోసం నిరంతరం తపించే సోదరి రక్షణకు అనుక్షణం కట్టుబడి ఉంటానని సోదరుడు ఆశీర్వాదం రూపంలో భరోసా ఇస్తాడు. ఇదే రక్షాబంధన్ ముఖ్య ఉద్దేశం. రాఖీ పౌర్ణమిగా పిల్చుకునే ఈ పండగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమిగా పిలుస్తారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారత దేశానికే పరిమితమైన ఈ పండగ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. నాటి ఉమ్మడి కుటుంబాల్లో రక్షాబంధన్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉండేది. ఇది ప్రస్తుతం చిన్న కుటుంబాల్లో విస్తరించడంతో మరింత ఆదరణ పెరిగింది. ఇది కేవలం రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్యే కాదు.. ఏ బంధుత్వం లేకపోయినా ప్రతి మహిళ తాను అన్నగా భావించే వ్యక్తికి రాఖీ కట్టి సోదర భావాన్ని చాటుకుంటుంది. వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆడపిల్ల సోదరుని ఆశీర్వాదం కోరుకుంటుంది. పౌర్ణమి రోజున రాఖీ కట్టి ఆశీర్వాదం పొందుతుంది. పౌర్ణమికి మహత్తర శక్తి ఉంటుంది. శ్రావణ పౌర్ణమి రోజున ఈ శక్తి మరెన్నో రెట్లు ఉంటుందని నమ్మకం. అయితే ఈసారి చంద్రగ్రహణం అడ్డురావడంతో రాఖీ పండుగపై తీవ్ర ప్రభావం కనబడుతోంది.. రాఖీ పండుగ జరుపుకోకూడదనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. అయితే ఉదయం పదిగంటలలోపు రాఖీ పండుగ జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. శ్రావణ పౌర్ణమిని ఒక్కోచోట ఒక్కో రీతిలో జరుపుకుంటారు. మహారాష్ట్రలో వారియల్ పూర్ణిమ, గుజరాత్లో అక్షర పూర్ణిమ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, బీహర్‌లో కజూరి పూర్ణిమ పేరుతో జరుపుకుంటారు. గుజరాత్ రాఖీ పండుగ పుట్టినిల్లుగా చెబుతారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







