చంద్రగ్రహణం, రెండు తెలుగు రాష్ర్టాల్లో ఆలయాల మూసివేత
- August 06, 2017
చంద్రగ్రహణం నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ర్టాల్లోని దేవాలయాలను మూసివేయనున్నారు. గ్రహణం ఘడియలు సోమవారం రాత్రి 10.52 ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తవుతాయి. సోమవారం సాయంత్రం 4.30 నుంచి మంగళవారం వేకువజామున 2 గంటల వరకు క్లోజ్ చేయనున్నారు. మంగళవారం వేకువజామున 2 గంటలకు ఆలయ తలుపులు తెరచి మందిర శుద్ధి, పుణ్యాహవచనం చేపట్టనున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
స్వామివారికి అన్నిరకాల సేవలు పూర్తయిన తర్వాత మంగళవారం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే గ్రహణం సమయంలో కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను అనుమతించమని, అన్నప్రసాద వితరణను నిలిపివేస్తామని స్పష్టంచేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గ దేవాలయం, శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి ఆలయం, భద్రాచలం రామాలయం, యాదగిరిగుట్ట ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







