'మేడమీద అబ్బాయి' టీజర్ విడుదల
- August 06, 2017
'కె మెరా.. యాక్షన్.. కట్' - నిద్రలోనూ ఇలానే పలవరిస్తుంటాడు ఆ కుర్రాడు. ఎప్పటికైనా ఓ పెద్ద దర్శకుడైపోవాలన్నది అతని కల. 'బాహుబలి' లాంటి సినిమా కాకపోయినా దానికి అటూ ఇటూగా ఓ సినిమా తీసేయాలని ఆశ పడుతుంటాడు. ప్రభాస్, రామ్‌చరణ్‌ల కోసం కథలు సిద్ధం చేశాడు. ఇక వాళ్లు పిలవడమే ఆలస్యం అన్నట్టు ఎదురుచూస్తుంటాడు. అలాంటి కుర్రాడి జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ప్రవేశించింది. ఆ తరవాత ఏమైంది? అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ విషయాలు తెలియాలంటే 'మేడమీద అబ్బాయి' సినిమా చూడాల్సిందే. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకుడు. ఇటీవల టీజర్ విడుదల చేశారు. నరేష్ మాట్లాడుతూ ''చాలా రోజుల తరవాత కథాబలం ఉన్న ఓ సినిమా చేశా.
ఆద్యంతం నవ్విస్తుంది. ఉత్కంఠ రేపే అంశాలూ ఈ కథలో ఉన్నాయ''న్నారు. ఈ నెలలో పాటల్ని, సెప్టెంబరులో సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాత. సంగీతం: షాన్ రెహమాన్.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







