హింసగా మారిన కెన్యా ఎన్నికల ప్రచారం

- August 06, 2017 , by Maagulf
హింసగా మారిన కెన్యా ఎన్నికల ప్రచారం

మంగళవారం జరుగనున్న కెన్యా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరిదశలో హింసాకాండతో హోరెత్తింది. ప్రస్తుత అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా, ఆయన ప్రత్యర్థి రైలా ఒడింగాకు మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీలో ఓట్ల రిగ్గింగ్‌, హింసాకాండ చోటు చేసుకుంటుందన్న భయాందోళనల మధ్య పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. ప్రచారం చివరి దశలో ఎన్నికల అధికారి ఒకరు హత్యకు గురికావటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలపై పోలీసులు దాడి చేసి భయానక వాతా వరణం సృష్టించేందుకు కుట్ర పన్నారని ప్రతిపక్షం ప్రభు త్వంపై ఆరోపణలు గుప్పిస్తోంది. దాదాపు దశాబ్ద కాలం క్రితం జాతి విద్వేష దాడులతో హోరెత్తి వివాదాస్పదంగా మారిన ఎన్నికల అనంతరం మంగళవారం జరుగనున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. అప్పటి ఎన్నికల్లో చెలరేగిన హింసాకాండలో దాదాపు 1,100 మంది మరణిం చగా, ఆరులక్షల మంది నిర్వాసితులైన విషయం తెలిసిందే. కెన్యన్లు ఇప్పటి వరకూ ఆరు ఎన్నికలను చూసినప్పటికీ ప్రస్తుత ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై వుండటం విశేషం. 
ముఖ్యంగా అధ్యక్షుడు కెన్యట్టా, ఆయన ప్రత్యర్థి ఒడింగా కుటుంబాల మధ్య దాదాపు అర్థశతాబ్దికి పైగా కొనసాగుతున్న రాజకీయ వైరానికి ఈ ఎన్నికలు చరమగీతం పాడనున్నాయన్న ప్రచారం విస్తృతంగా కొనసాగటమే ఇందుకు కారణం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com