'మేడమీద అబ్బాయి' టీజర్ విడుదల

- August 06, 2017 , by Maagulf
'మేడమీద అబ్బాయి' టీజర్ విడుదల

'కె మెరా.. యాక్షన్‌.. కట్‌' - నిద్రలోనూ ఇలానే పలవరిస్తుంటాడు ఆ కుర్రాడు. ఎప్పటికైనా ఓ పెద్ద దర్శకుడైపోవాలన్నది అతని కల. 'బాహుబలి' లాంటి సినిమా కాకపోయినా దానికి అటూ ఇటూగా ఓ సినిమా తీసేయాలని ఆశ పడుతుంటాడు. ప్రభాస్‌, రామ్‌చరణ్‌ల కోసం కథలు సిద్ధం చేశాడు. ఇక వాళ్లు పిలవడమే ఆలస్యం అన్నట్టు ఎదురుచూస్తుంటాడు. అలాంటి కుర్రాడి జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ప్రవేశించింది. ఆ తరవాత ఏమైంది? అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ విషయాలు తెలియాలంటే 'మేడమీద అబ్బాయి' సినిమా చూడాల్సిందే. అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నిఖిల విమల్‌ కథానాయిక. జి.ప్రజిత్‌ దర్శకుడు. ఇటీవల టీజర్‌ విడుదల చేశారు. నరేష్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల తరవాత కథాబలం ఉన్న ఓ సినిమా చేశా.
ఆద్యంతం నవ్విస్తుంది. ఉత్కంఠ రేపే అంశాలూ ఈ కథలో ఉన్నాయ''న్నారు. ఈ నెలలో పాటల్ని, సెప్టెంబరులో సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాత. సంగీతం: షాన్‌ రెహమాన్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com