రోబోట్ల సేవలను పొందనున్నాదుబాయి విమానాశ్రయం

- October 21, 2015 , by Maagulf
రోబోట్ల సేవలను పొందనున్నాదుబాయి విమానాశ్రయం

దుబాయి విమానాశ్రయంలో రోబోట్ల సేవలు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శకులు త్వరలో దుబాయి విమానాశ్రయంలో తమ వీసా అవసరాలను పర్యవేక్షించే రోబోట్ల సేవలను పొందనున్నారు! అన్ని వీసా సేవలు కాకపోయినా, ట్రాన్సిట్ సందర్శకులు, వీసా-ఆన్-ఆరైవాల్ సదుపాయాన్ని పొందగోరిన వారు క్యూ లలో వేచిఉండనవసరం లేకుండా, వారి పేపర్ వర్క్ ను ఈ రోబోట్లు నిర్వహిస్తాయి. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 మరియు 3 లలో, అల్ మక్తౌమ్ విమానాశ్రయం మరియు దుబాయి ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలలో  మొత్తం 13 రోబోట్లు నియోగింపబడతాయని, ఇవి వీసా రెన్యూవల్ విజ్ఞప్తులను కూడా నిర్వహించగలవని, అందుకోసం నివాసితులు చేయవలసిందదల్లా - వారి ఎమిరేట్స్ ఐ. డి. లను స్వైప్ చేసి, అనంతరం సూచనలు పాటించడమేనని చెల్లింపులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చేయవచ్చని జనరల్ డైరక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఆఫైర్స్ (గ్ద్ర్ఫా ) అధికారి ఒకరు ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న జి టెక్స్ టెక్నాలజీ వీక్ లోని రోబట్ ప్రదర్శన సందర్భంగా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com