బిన్ థాని మార్గంలో ప్రవేశము పాక్షికంగా మూసివేత
- October 21, 2015
కతార్ లోని కోర్నీచే రహదారి అభివృద్ధి ప్రాజెక్టు పనుల రెండవ దశలో భాగంగా, మొహమ్మెద్ బిన్ థాని రహదారిలో గల కతార్ నేషనల్ థియెటర్ ఇంటర్శెక్షన్ వద్ద, కోర్నీచే వీధి నుండి అల్ బిదా వీధి వరకు ఉన్న ప్రవేశ మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కతార్ ప్రజాపనుల అధికార సంస్థ ' అస్ఘల్' తెలియజేసింది. ఈ మూసివేత 2015, అక్టోబరు 22 వ తారీఖు నుండి 25 తేదీ వరకు వర్తిస్తుందని, ఈ కాల అవధిలో కోర్నీచే వీధి నుండి అల్ బీదా వీధి వరకు వెళ్లే వాహనాలు రుమాలియా రౌండ్ అబౌట్ గుండా అల్ బీదా వీధిలో ప్రవేశించి ఉత్తరదిక్కుగా ప్రయాణం కొనసాగించవలసిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు. అస్ఘల్, ఈ విషయాన్ని తెలిపే రహదారి సూచికలను ఏర్పాటుచేశామని, వాటిని గమనించి, వేగా పరిధి ప్ర్కరం ప్రయాణించి భద్రమైన ప్రయాణాన్ని కొనసాగించాలని వారు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







