శాన్‌ఫ్రాన్సిస్‌కో విమానాశ్రయంలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం
- August 07, 2017
అమెరికాలో భారీ విమాన ప్రమాదం తప్పింది. శాన్‌ఫ్రాన్సిస్‌కో విమానాశ్రయంలో కెనడాకు చెందిన విమాన ల్యాండింగ్ అందర్నీ కలవరపెట్టింది. 140 మంది ప్రయాణికులతో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో అక్కడే ఆగి ఉన్న విమానాలకు చేరువుగా కెనడా విమానం ఎగిరింది. కేవలం 30 మీటర్ల ఎత్తు నుంచి రెండు విమానాలను తప్పించుకున్నది. ఈ ఘటన ఈనెల 7న జరిగింది. రన్‌వేపై దిగాలనుకున్న కెనడా విమానం అకస్మాత్తుగా టాక్సీవేకు దగ్గరగా వచ్చింది. అయితే టాక్సీవేపై నాలుగు విమానాలు పార్క్ చేసి ఉన్నాయి. మొదటి రెండు విమానాలకు కేవలం 30 మీటర్ల ఎత్తు నుంచే కెనడా విమానం వెళ్లింది. ఏటీసీ అధికారులు కెనడా విమాన పైలెట్‌ను అలర్ట్ చేయడంతో అతను విమానాన్ని పైకిలేపాడు. అలా పైకి తీసుకెళ్లడం వల్ల పార్క్ చేసిన మిగతా రెండు విమానాలకు దూరంగా కెనడా విమానం వెళ్లింది. మళ్లీ రౌండ్ కొట్టిన విమానం ఆ తర్వాత సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. విమానాశ్రయ అధికారులు ఈ ఘటన పట్ల విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







