దేశ వ్యాప్తంగా 11 లక్షల పాన్ కార్డులు రద్దు
- August 07, 2017
దేశ వ్యాప్తంగా పెద్దసంఖ్యలో పాన్‌కార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. ఆదాయపన్ను శాధికారులు కొంత కాలంగా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజా నివేదికల ప్రకారం జులై 27 నాటికి దేశ వ్యాప్తంగా 11,44,211 నకిలీ పాన్ కార్డులను రద్దు చేసినట్టుగా సమాచారం. అలాగే ఈ నెలాఖరు నాటికి ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ పాన్ నెంబర్ పని చేస్తోందో లేదో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ పలు సూచనలు ఇచ్చింది.
1 ఆదాయం పన్ను ఈఫైలింగ్ పోర్టల్ సందర్శించవచ్చు.
2 ఇందులోని హోమ్ పేజీలో 'సర్వీసులు' అనే టాబ్ కింద
'నో యువర్ పాన్' క్లిక్ చేయాలి.
3 అక్కడ మీరు చేయాల్సిన పని. పేరు, పుట్టిన తేదీ, జెండర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఇవ్వాలి.
4 రిజిస్టర్ మొబైల్ నంబరుకు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ అనే బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
5 దీంతో పాన్ చెల్లుబాటులో ఉన్నట్టయితే రిమార్క్ కాలంలో 'యాక్టివ్' అన్న సందేశం వస్తుంది.
ఎస్‌ఎంఎస్‌తోనూ..
ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారానే కాకుండా 567678 లేదా 56161కు ఎస్‌ఎంఎస్ చేయడం ద్వారా పాన్ అనుసంధానం చేసుకోనే వీలుంది. ఈ ప్రక్రియకు గానూ యుఐడిపాన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెలు గల మీ ఆధార్ నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, మీ 10 అంకెల పాన్ నెంబర్ ఎంటర్ చేసి పైన తెలిపిన నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి. దీన్ని నిర్ధారిస్తూ మొబైల్‌కు ఒక సందేశం వస్తుంది. దీంతో కీలకమైన ఆధార్‌తో పాన్ అనుంసంధానం ముగుస్తుంది. ఆదాయ పన్ను దాఖలుకు ఆధార్‌తో పాన్‌కార్డు లింక్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31లోపు ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దువుతాయని ఆదాయ పన్ను శాఖ ఇది వరకే హెచ్చరించింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







