సౌదీ యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌లో ఒకరి కాల్చివేత

- August 07, 2017 , by Maagulf
సౌదీ యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌లో ఒకరి కాల్చివేత

 సెక్యూరిటీ ఫోర్సెస్‌ ఓ తీవ్రవాదిని కాల్చి చంపగా, మరో ఇద్దర్ని సజీవంగా పట్టుకున్నారు. ఈస్టర్న్‌ సౌదీ అరేబియాలోని సైహాత్‌లో సెక్యూరిటీ ఫోర్సెస్‌ నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉందుగా అనుమానితుల్ని గుర్తించిన సెక్యూరిటీ ఫోర్సెస్‌, వారిని చుట్టుముట్టారు. అయితే తీవ్రవాదులు ముందుగా, భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇంకో ఘటనలో ఇద్దరు వ్యక్తులు భద్రతాదళాల యెదుట లొంగిపోయాయి. ఆ ఇద్దరినీ వాంటెడ్‌ వ్యక్తులైన రామ్జి ఎం అల్‌ జమ్ముల్‌ అలి హెచ్‌ అల్‌ జైద్‌గా గుర్తించారు. వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న 23 మందిలో ఎనిమిది మంది ఇప్పటికే లొంగిపోవడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com