దుబాయ్‌లో ఇండియన్ కాన్సులేట్ యోగా ఈవెంట్
- August 08, 2017
దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులూట్ జనరల్, యోదా ఈవెంట్‌ని శుక్రవారం సాయంత్రం నిర్వహించనుంది. ఆధ్మాత్మిక, అలాగే భౌతిక ప్రయోజనాలకోసం సహజయోగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1970లో సహజ యోగాని శ్రీమతి మాతాజి నిర్మలా దేవి ఆవిష్కరించారు. అది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సహజయోగాని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే విధంగా ఈ తరహా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని ఈవెంట్ ఆర్గనైజర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావొచ్చు. అయితే, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం ఫాలో ఆన్ ఈవెంట్ జరుగుతుంది. దీనికోసం ఎలాంటి ప్రీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. బుర్ దుబాయ్‌లోని సింధి సెర్మోనియల్ హాల్లో శనివారం ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. సహజయోగాతో ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటవుతుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







