మోడిఫైడ్ కార్లకోసం కొత్త ఇన్స్పెక్షన్ సెంటర్
- August 08, 2017
అబుదాబీలో తొలిసారిగా మోడిఫైడ్ వెహికిల్స్ కోసం ఇన్స్పెక్షన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. వాహనదారులు తమ ఆలోచనలకు తగ్గట్టుగా వాహనాలకు మార్పులు చేస్తుంటారు. అలాంటి వాహనాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలపై స్పష్టత ఇచ్చేందుకు, వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ మంజూరు చేసేందుకు ఈ కొత్త సెంటర్ ఏర్పాటు చేశారు. మెరీనా సర్క్స్యూట్లో ఈ కొత్త సెంటర్ ఏర్పాటు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, యాస్ మెరినా సర్క్యూట్, ఆటోమొబైల్ అండ్ టూరింగ్ క్లబ్ యూఏఈ, ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ మెట్రాలజీ తదితర విభాగాలు సంయుక్తంగా ఈ సెంటర్ ఏర్పాటుకి కృషి చేశాయి. ఇకపై వాహనాలకు ఏ మార్పులు జరిగినా చట్ట పరిధికి లోబడి ఉంటాయనీ, వాహనదారులకు అలాగే రోడ్లపై వెళ్ళేవారికి ఈ తరహా వాహనాల ద్వారా ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదకరమైన రీతిలో వాహనాలకు మార్పులు జరిగితే, అలాంటివి ఇక్కడ సరిదిద్దబడతాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







