కేరళీయుల కోసం 36 బడ్జెట్ విమాన సర్వీసులు
- August 09, 2017
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 40 అదనపు విమాన సర్వీసుల్ని షార్జా - ఇండియా మధ్య నడుపుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా కేరళీకులయకు ఈద్, ఓనమ్ సందర్భంగా సెలవుల అనంతరం రిటర్న్ జర్నీ కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విమానాల్లో ఒక్కోదాంట్లో 186 మంది ప్రయాణీకులుంటారు. ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఈ తక్కువ ఛార్జీల విమానాలు సేవలందిస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని తిరువనంతపురం, కోచి, కోజికోడ్‌తోపాటుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి సేవలందిస్తాయి. కేరళ నుంచి ఎక్కువగా యూఏఈకి వలస వెళ్ళినవారు ఉంటారనీ, ఈ కారణంగా ప్రత్యేక విమాన సర్వీసుల్ని కేరళకు నడుపుతామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికార ప్రతినిథి వెల్లడించారు. యూఏఈలో మొత్తంగా 1 మిలియన్ కేరళీయులు ఉంటారనేది ఓ అంచనా. వారానికి 150 విమానాలు యూఏఈ నుంచి ఇండియాకి నడుపుతుంటారు. వీరిలో మెజార్టీ కేరళ సెక్టార్‌లోనే ప్రయాణిస్తుంటారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









