ఇండియా ఎడ్యుకేషన్ ఫెస్టివల్‌లో నహ్యాన్ ప్రసంగం
- August 09, 2017
ప్రతి చిన్నారికీ విద్య ఓ హక్కు అని, సమాజంలోని అన్ని అసమానతలకీ విద్యతో చెక్ పెట్టవచ్చునని మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ నాలెడ్జ్ డెవలప్‌మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ చెప్పారు. యూఏఈకి చెందిన జెమ్స్ ఎడ్యుకేషన్, అలాగే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జైపూర్‌లో నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో నహ్యాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫెస్టివల్‌కి గౌరవ అతిథిగా షేక్ నహ్యాన్ వ్యవహరించారు. ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాల్లో తల్లిదండ్రులు భాగస్వాములు కావాల్సి ఉందనీ, అప్పుడే విద్య పట్ల సమాజం మరింత మెరుగైన విధంగా ఆలోచించడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ప్రతి చిన్నారికీ విద్య ప్రాథమిక హక్కుగా లభించేందుకోసం విద్యా సంస్థలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ, పిల్లలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యను అందించడం, అలాగే పాఠాలు చెప్పడంలో సరికొత్త నైపుణ్యాల్ని అందిపుచ్చుకోవడం అవసరమని షేక్ నహ్యాన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







