భారతీయులు ఖతార్ వెళ్లాలంటే వీసా అక్కర్లేదు
- August 10, 2017
ఇక నుంచి భారతీయులు ఖతార్ వెళ్లాలంటే వీసా వంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు భారత్‌తో కలిపి 80 దేశాల ప్రజలకు వీసాలేని ప్రయాణాలకు అనుమతి ఇస్తూ ఖతార్ నిర్ణయం తీసుకుంది. వాటిల్లో యూకే, యూఎస్, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలు ఉన్నాయి. 'ఇక నుంచి ఖతార్‌ను సందర్శించేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు' అని ఖతార్ అధికారులు వెల్లడించారు. సందర్శనకు వచ్చేవారి కోసం ఎటువంటి రుసుం లేకుండా మల్టీ ఎంట్రీ మినహాయింపును జారీ చేస్తామని పేర్కొన్నారు. సందర్శకుడి జాతీ యతను బట్టి మినహాయింపు గడువు 180 రోజుల వరకు, 90 రోజులు ఖతార్‌లో గడిపేందుకు అనుమతి ఇస్తామని వివరించారు. ఖతార్ దేశ ఆతిథ్యం, చారిత్రక సాంస్కృతిని విస్తరించే కార్య క్రమంలో భాగంగా సందర్శకులను ఆహ్వానిస్తున్నామని, దానికోసమే 'ఫ్రీ వీసా' కల్పిస్తున్నట్టు పర్యాటక శాఖ చైైర్మెన్ హస్సన్ ఆల్ ఇబ్రహీం తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









