సిరిసిల్లనుంచే పోటీచేస్తా అంటున్న కేటీఆర్‌

- August 10, 2017 , by Maagulf
సిరిసిల్లనుంచే పోటీచేస్తా అంటున్న కేటీఆర్‌

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల అనంతరం దూకుడు ను పెంచిన కేటీఆర్, వీలు చిక్కినప్పుడల్లా ప్రతి పక్షాలపై తన దైన స్టైల్ లో విరుచుకుపడున్నారు. హైదరాబాద్ ఎన్నికలు తన భుజస్కందాలపై వేసుకుని కనీవిని ఎరుగని రీతిలో విజయాన్ని సాధించారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటనంతరం పార్టీలోకి వచ్చిన నాటి నుంచి తన రూట్ ను పంథాను చూపిస్తూ వచ్చారు.
ఉద్యమ కాలంలో విద్యార్ధులు, యువకులు చాలా అవసరమని నేరుగా వారి వద్దకు వెళ్లి సంప్రదించి పార్టీలో విద్యార్ధులను మమేకం చేశారు. ఇకపోతే... ఆయన ఎమ్మెల్యేగా పోటి చేయాలని భావించిన నాటి నుంచి సిరిసిల్ల నియోజక వర్గాన్ని ఎంచుకుని ఎమ్మెల్యే ఎన్నికై వస్తున్నారు. తాజాగా 2014 ఎన్నికల్లో సైతం సిరిసిల్ల నుంచే పోటీ చేసి ఇప్పుడు కేసీఆర్ కెబినేట్ లో డబుల్ ధమాకా తీసుకుని మంత్రి అయ్యారు.
2019 ఎన్నికల్లో కేటీఆర్ నియోజక వర్గం మార్పు తప్పదని భావిస్తున్న తరుణంలో కేటీఆర్ తన పోటీ పై క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సిరిసిల్లనుంచే పోటీచేస్తాను. నియోజక వర్గ మారే ప్రసక్తే లేదన్నారు. అని నొక్కిచెప్పారు. తాజాగా తన స్వంత నియోజక వర్గంలో నేరేళ్ల ఘటనను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి పక్షాలు కావాలనే నేరేళ్ల సంఘటనను ఇష్యూ చేస్తున్నాయి.
విపక్షాలు అక్కడికి వెళ్లాయి. రాజకీయావసరాలకు ప్రభుత్వం ఏదో ఒకరాయి విసరాలి అనుకున్నాయి అంతే. అన్నారు. ఆ తరువాత ప్రజలకు కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంటుందన్నారు. మొత్తం మీద కేటీఆర్ మాత్రం తన నియోజక వర్గ మార్పు ఉండదని చెప్పడం కొసమెరుపు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com