జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ టెంపో..పది మంది దుర్మరణం
- August 10, 2017
గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎన్ని పాటిస్తున్నప్పటికీ కొంత మంది చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరికొంత మంది డ్రైవర్లు మద్య సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మరికొన్ని సార్లు అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో ప్రయాణికులతో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో దాదాపు 200 అడుగుల లోతు ఉన్న లోయలో జారిపడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందగా మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మహారే బెల్ట్‌లో చెకినల్లా ప్రాంతంలోని ఓ భారీ లోయలో టెంపో పడిపోయిందని రియాస్పీ ఎస్ఎస్పీ తహి సాజద్ తెలిపారు. మృతదేహాలను దవాఖానకు తరలించినట్టు, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









