కొడుకు చూడట్లేదంటూ కోర్టు మెట్లెక్కిన 'రేమండ్స్' అధినేత విజయ్ సింఘానియా
- August 10, 2017
సామాన్యుడికి ఉండే కష్టాలు ధనవంతులక్కూడా ఉంటాయి. కాకపోతే అవి కొన్ని వెలుగు చూసి వార్తల్లోకి వస్తాయి. కొన్ని నాలుగ్గోడల మధ్యే ఉండిపోతాయి. ఇలాంటి వాటికి వారేమీ అతీతులు కారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. రేమండ్ బ్రాండ్ పేరుతో పురుషుల వస్త్రాలు తయారు చేసి ఓ వెలుగు వెలిగిన విజయ్‌పథ్ సింఘానియాకు కూడా కొడుకు గౌతమ్ సింఘానియాతో కష్టాలు తప్పట్లేదు. తాను సంపాదించిన ఆస్తి అంతా తీసుకుని ఇప్పుడు తనను బయటకు గెంటివేశాడని కోర్టుకెక్కాడు. ముంబైలోని మలబార్ హిల్స్‌లో రేమండ్స్ సంస్థ నిర్మించిన 36 అంతస్తుల జేకే కాంప్లెక్స్‌లో ఒక డూప్లెక్స్ ఇల్లు రావల్సి ఉంది. అలాగే విజయ్ పథ్ మరో కుమారుడి అజయ్ పథ్ సింఘానియాకి కూడా 4 ఇళ్లు రావాల్సి ఉంది. ఆ సంస్థలోని రూ.1000 కోట్ల విలువైన షేర్లను గౌతమ్ పేర ఉండడంతో విజయ్ పథ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం ఆయన ఓ అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కంపెనీ నిబంధనల ప్రకారం విజయ్ సింఘానియాకు నెలకు రూ.7 లక్షలతో పాటు, కనీస వసతి కల్పించాలి. అవి కూడా గౌతమ్ కల్పించడం లేదని విజయ్‌పథ్ తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







