మాల్దీవుల్లో విద్యార్థులను మోసగించిన నారాయణరెడ్డి అరెస్ట్
- August 11, 2017
మాల్దీవుల్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులను ఉద్యోగాల పేరుతో తీసుకువెళ్లి మోసగించిన బారెడ్డి వెంకట నారాయణరెడ్డి (42) అలియాస్ పెద్ద నారాయణరెడ్డిని మలక్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు దిల్సుఖ్నగర్ గడ్డిఅన్నారం ప్రాంతంలో ఆర్యన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్‌కు అధ్యక్షుడు, ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. మరో భాగస్వామి పాశం నందు పరారీలో ఉన్నాడు. మరో భాగస్తుడైన మహీపతి కృష్ణచైతన్య (35)ను ఈనెల 6న అరెస్ట్ చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మలక్‌పేట పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా తొలుత నారాయణరెడ్డి భార్య అనితరెడ్డిని విచారించారు. తమను సింగపూర్‌కు పంపిస్తానని బ్యాంకాక్‌లో మోసగించాడని మరో నలుగురు విద్యార్థులు కూడా ప్రధాన నిందితుడిపై ఠాణాలో ఫిర్యాదు చేశారు.
భవిష్యత్తులో విద్యార్థులు మోసపోకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ విద్యార్థులు.. వారి కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







