లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ ర్యాలీ

- August 11, 2017 , by Maagulf
లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ ర్యాలీ

లండన్ లో ఎన్నారై టిఆర్ ఎస్ ఆధ్వర్యంలో కేసిఆర్ ఫర్ ఫార్మర్స్ అండ్ వీవర్స్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రైతులకోసం చేస్తున్న కృషి ని ప్రపంచానికి చాటేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు ఎన్నారై టిఆర్ ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు. లండన్ లోని అంబేద్కర్ హౌజ్ నుంచి సెంట్రల్ లండన్ మీదుగా... భారత హై కమిషన్ కార్యాలయం వద్ద ఉన్న నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్రప్రభుత్వం వెంటనే జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వారు విజ్ణప్తిచేశారు. ఈ ర్యాలీలో టిఆర్ ఎస్ యూకె సభ్యులతోపాటు ఎన్నారైలు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com