'ప్రాజెక్ట్ Z' సెన్సార్ పూర్తి

- August 13, 2017 , by Maagulf
'ప్రాజెక్ట్ Z' సెన్సార్ పూర్తి

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన మాయావన్ చిత్రాన్ని ప్రాజెక్ట్ z గా ఎస్‌బికె ఫిలింస్‌ కార్పోరేషన్‌లో ఎస్‌.కె. బషీద్‌ సమర్పణలో నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ ప్రథమార్ధం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న సందీప్, తాజాగా నక్షత్రం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ zతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com