ఇండోనేషియా ను వణికించిన మరో భూకంపం
- August 13, 2017
జకార్తా: ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో ఆదివారం నాడు భూకంపం చోటుచేసుకొంది. బెంగ్కులు ప్రాంతానికి 73 కి.మీ. దూరంలోని భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూకంపలేఖినిపై 6.5 తీవ్రత నమోదైంది. అయితే ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు ప్రకటించారు.
సమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం కారణంగా సింగపూర్‌లో కూడ అక్కడక్కడ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. ప్రజలంతా భయంతో ఇళ్ళలో నుండి బయటకు వచ్చారు.
ఎప్పుడు ఏం జరుగుతోందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ళనుండి బయటనే నిరీక్షిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది.
గత ఏడాది డిసెంబర్లో ఇండోనేషియాలోని ఏస్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం కారణంగా వందమంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
తాజాగా చోటుచేసుకొన్న భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్గం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉందని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







