అమరావతి లోఈ నెల 16న లండన్ కింగ్స్ ఆస్పత్రికి శంకుస్థాపన
- August 14, 2017
అమరావతి మనందరికీ గర్వకారణం
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో సీఎం
ప్రపంచంలో మన కీర్తిపతాకను రెపరెపలాడించే అమరావతి మనందరికీ గర్వకారణం సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయనున్న పోలవరం ప్రాజెక్టు ప్రగతిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఈ 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలూ సమానంగా అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి సీఎం వివరించారు. ఇప్పటికే విట్, ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలు రాజధానిలో తమ క్యాంప్సలను ప్రారంభించాయని, బీఆర్ శెట్టి వైద్యవిజ్ఞాన సంస్థ కొద్ది రోజుల క్రితమే ఇక్కడి తన ప్రాంగణానికి భూమిపూజ జరిపిందని పేర్కొన్నారు.
ఇదే బాటలో మరెన్నో విఖ్యాత విద్యాసంస్థలు అమరావతికి వస్తున్నాయన్న చంద్రబాబు... ప్రపంచంలో పేరొందిన లండన్ కింగ్స్ హాస్పిటల్ రూ.1000 కోట్లతో ఇక్కడ నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఈ నెల 16న శంకుస్థాపన జరుగుతుందన్నారు. రాజధానితోపాటు ప్రతి జిల్లాను ప్రగతికి చిహ్నంగా నిలిచేలా, వాటి భౌగోళిక స్థితిగతులు, లభ్యమయ్యే సహజ వనరుల ఆధారంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును స్వాతంత్య్ర దినాన ప్రారంభించబోతున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







