అసోం, బిహార్ రాష్ట్రాలలో వరదల బీభత్సం
- August 14, 2017
అసోం, బిహార్ రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అసోంలోని 33 జిల్లాల్లో 21 జిల్లాలపై వరద ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఆదివారం ఒక్కరోజు సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర నది అనేకచోట్ల ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో సహాయచర్యల్లో పాల్గొనేందుకు సైన్యం రంగంలోకి దిగింది. వరద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల కారణంగా దూరప్రాంత రైళ్లలన్నింటినీ రద్దు చేశారు.
బిహార్‌లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో 12 జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాక్‌లు, రహదారులు నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోసహాయకచర్యలు చేపట్టేందుకు 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







