పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినాఫాసోలో ఉగ్రదాడి.. 17 మంది మృతి

- August 14, 2017 , by Maagulf
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినాఫాసోలో ఉగ్రదాడి.. 17 మంది మృతి

8మందికి గాయాలు 
 పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బుర్కినా ఫాసో రాజధాని వాగాదువోలో ఉన్న టర్కీస్‌ రెస్టారెంట్‌లోకి స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం 9 గంటల సమయంలో దుండగులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో వివిధ దేశాలకు చెందినవారు ఉన్నారని ఆఫ్రికన్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడి కారణంగా వాగాదుగో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని పోలీసులు వెల్లడించారు.
బుర్కినాఫాసోలో గత రెండేళ్ల కాలంలో ఉగ్రదాడి జరగడం ఇది రెండోసారి. గతేడాది జనవరిలో ఓ కేఫ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు 30 మందిని పొట్టపెట్టుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com