టీజర్లలో వివేకం' ప్రపంచ రికార్డు
- August 14, 2017
టీజర్లలో ప్రథమ స్థానం
నటుడు అజిత్ నటించిన 'వివేకం' టీజర్ యూ ట్యూబ్లో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం టీజర్ మూడు నెలల కింద యూ ట్యూబ్లో విడుదలైంది. ఇప్పటివరకు 1.90 కోట్ల వీక్షణలు సొంతం చేసుకుంది. 5.24,872 వేల లైకులు కొట్టేసింది. మూడు నెలల్లో ఇన్ని లైకులతో ప్రథమ స్థానం సంపాధించిన ఈ టీజర్ ప్రపంచ రికార్డు సృష్టించినట్లు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతకాలం యూట్యూబ్ ద్వారా 'మార్వెలిన్ అవెంజర్స్' అనే ఓ టీజర్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు సమాచారం. అది విడుదలైన మూడు సంవత్సరాలకు ఎనిమిది కోట్ల వీక్షణలు, 5.24,009 లైకులు సాధించింది. కాని.. అజిత్ నటించిన వివేకం చిత్రం టీజర్ మూడు నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టడం విశేషమంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







