ఉత్తమ నటుడు హీరో నాగచైతన్య
- August 14, 2017
''బాహుబలి'తో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసింది. భవిష్యత్తులోనూ ఇలాంటి గొప్ప చిత్రాలు మరిన్ని రావాల''న్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. హైదరాబాద్‌లో జరిగిన 'సంతోషం' పురస్కారాల వేడుకలో ఆయన పాల్గొన్నారు. 'ప్రేమమ్' చిత్రానికి గానూ నాగచైతన్యకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. సమంత (అఆ) ఉత్తమ నటిగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా బోయపాటి శ్రీను (సరైనోడు) అవార్డు అందుకొన్నారు. ఉత్తమ చిత్రంగా 'పెళ్లిచూపులు' నిలిచింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ''తెలుగు సినీ పరిశ్రమకు కావల్సిన సహాయ సహకారాల్ని అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమలో కొన్ని సమస్యలున్నాయి. కూర్చొని మాట్లాడుకొంటే అవన్నీ పరిష్కారమైపోతాయ''న్నారు. దాసరి నారాయణరావు స్మారక పురస్కారాల్ని అల్లు అరవింద్, మురళీమోహన్, పరుచూరి బ్రదర్స్ అందుకొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







