బ్రూస్లీకి సంగీత దరశకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు
- August 14, 2017
కోలీవుడ్‌లో సంగీత పయనాన్ని ప్రారంభించిన ఏఆర్.రెహ్మాన్ ఆ తరువాత టాలీవుడ్, బాలీవుడ్‌లను దాటి హాలీవుడ్ చిత్రాలకు తన సంగీత మాధుర్యాన్ని అందించే స్థాయికి ఎదిగారు. ఆంగ్ల చిత్రం స్లమ్డాగ్తో ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఆ సంగీత మాంత్రికుడు మరోసారి అంతర్జాతీయ స్థాయి చిత్రానికి సంగీతం అందించడానికి రెడీ అయ్యారన్నది తాజా సమాచారం. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారంటే ఆ చిత్రం క్రేజే వేరు అని చెప్పనక్కర్లేదు. కాగా కరాటే కింగ్ బ్రూస్లీ పేరు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సజీవం అని వేరే చెప్పక్కర్లేదు.
సినిమాల్లో ఏ నటుడూ చెయనటువంటి సాహసాలు చేసిన నటుడు బ్రూస్లీ. అలాంటి బ్రూస్లీ జీవిత చరిత్ర వెండి తెరకెక్కుతోంది. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు, నటుడు శేఖర్‌కపూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే సాహసం చేస్తున్నారు. ఆ బ్రహ్మాండ చిత్రాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో శేఖర్‌కపూర్ స్వయంగా వెల్ల డించారు. ఈ చిత్రానికి లిటిల్డ్రాగన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంగీతంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఏఆర్.రెహ్మాన్ సినీ కేరీర్లో ఈ లిటిల్ డ్రాగన్ చిత్రం మరో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







