ఎయిరిండియా బంపర్ ఆఫర్
- August 14, 2017
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపికచేసిన దేశీయ విమానాల్లో టిక్కెట్ ప్రారంభ ధర 425 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఎయిరిండియా ప్రకటించింది. విదేశీ విమానాలకైతే రూ.7000 కంటే తక్కువగానే ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. పరిమితి కాల వ్యవధిలో వీటిని ఆఫర్ చేయనున్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. 2017 ఆగస్టు 20 వరకు ఈ ''ఫ్రీడం సేల్'' అందుబాటులో ఉంటుందని ఎయిరిండియా తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
రెండు ప్రయాణ కాలాలు 2017 సెప్టెంబర్ 16 నుంచి 2017 నవంబర్ 30కి మధ్య, 2018 జనవరి 25 నుంచి 2018 మార్చి 31 మధ్య ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిరిండియా బుకింగ్స్ ఆఫీసులు, ఎయిరిండియా వైబ్‌సైట్, మొబైల్ యాప్, లేదా ఎయిరిండియా కాల్ సెంటర్, అధికారిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చని ఈ విమానయాన సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







