‘ఫైన్’యాపిల్!
- August 14, 2017
కోయటం కాస్త కష్టమేమో గానీ పైనాపిల్ ముక్కల రుచే వేరు. పుల్లపుల్లగా.. తీయతీయగా ఉండే వీటిల్లో విటమిన్లు, పోషకాలు సైతం దండిగానే ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
* విటమిన్ సి గని: ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్టే. దీంతో రోగనిరోధకశక్తి బాగా పుంజుకుంటుంది. కణజాలం వృద్ధి చెందటానికి, కణాల మరమ్మతులోనూ విటమిన్ సి పాలు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే. పైగా దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం ముంచుకురాకుండానూ.. క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిజేరకుండానూ చూస్తాయి. వ్యాయామం చేసేవారిలో విటమిన్ సి స్థాయులు తగ్గితే కేలరీలు తక్కువగా ఖర్చవుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంటే పైనాపిల్ బరువు తగ్గటానికీ తోడ్పడుతుందన్నమాట.
* జీర్ణక్రియ మెరుగు: పైనాపిల్‌తో కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలూ దూరమవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువెక్కువ తినకుండానూ చూస్తుంది. అలాగే మలబద్ధకం దరిజేరకుండా కాపాడుతుంది.
* చర్మం నిగనిగ: పైనాపిల్‌లో మ్యాంగనీసు ఖనిజం కూడా దండిగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కలతో మన శరీరానికి రోజుకు అవసరమైనంత మ్యాంగనీసు లభిస్తుంది. ఇది విటమిన్ సితో కలిసి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలు దెబ్బతినకుండానూ కాపాడుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







