తీవ్రవాదుల ఏరివేత: ప్రజల పునరావాసానికి ఏర్పాట్లు
- August 14, 2017
అల్ అవామియా: కాతిఫ్లోని అల్ అవామియాలోగల అల్ ముసావారాలో భద్రతాదళాలు తీవ్రవాదుల్ని పూర్తిగా ఏరివేయడంతో మూడు నెలల తర్వాత ప్రజలు తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళేందుకు మార్గం సుగమం అవుతోంది. సౌదీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పూర్తిగా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. కొన్నాళ్ళుగా ఇక్కడ తిష్టవేసిన తీవ్రవాదులు, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడంఓతపాటుగా ఇక్కడినుంచే దేశంపై దండెత్తే కార్యక్రమాలు చేపట్టారు. వారిని పూర్తిగా భద్రతాదళాలు నిర్వీర్యం చేయగలిగాయి. సుమారుగా 428 కుటుంబాలు ఈ ప్రాంతం నుంచి తీవ్రవాదుల కారణంగా వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళాయి. వారందరికీ ప్రభుత్వం తిరిగి అల్ ముసావారా విలేజ్‌లో పునరావాసం కల్పిస్తోంది. కొన్ని వారాల్లోనే పూర్తిగా ఇక్కడి భవనాల్ని పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలావరకు కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిల్లో కొన్ని పూర్తయి, పునరావాసానికి అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







