నంద్యాల ఎన్నికల ప్రచారంలోకి హీరో నందమూరి బాలయ్య
- August 15, 2017
నంద్యాల ఉప ఎన్నికల వేడి మాములుగా లేదు..వైసీపీ , టీడీపీ నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ క్యాబినెట్ మొత్తం నంద్యాలలోని మకాం వేయగా , రేపు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాబోతున్నాడు. టీడీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించేందుకు బాలకృష్ణ ప్రచార పర్యటన ఖరారైంది.
బాలకృష్ణ 16న నంద్యాలలో పర్యటించేందుకు వస్తున్నట్లు సమాచారం. ముందుగా పార్టీ శ్రేణులు ఆయనను రెండు రోజులు నంద్యాలలో పర్యటించాలని కోరారు. కానీ ఈ నెల 17 న అయన నటించిన పైసా వసూల్ మూవీ ఆడియో వేడుక ఉండడం తో ఒక్క రోజు మాత్రమే నంద్యాల పర్యటన కు వస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాని ప్రకారమే రేపు అయన పర్యటించనున్నారు. ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలోని నందమూరి అభిమాన సంఘాల సమావేశమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున విస్తృత ప్రచారం నిర్వహించేందుకు నందమూరి అభిమాన సంఘాలు ఇప్పటికే కార్యాచరణ రూపొందించాయి. జూనియర్ ఎన్‌టీఆర్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్‌టీఆర్, నందమూరి కళ్యాణ్‌రామ్, నందమూరి తారకరత్న అభిమాన సంఘాల సభ్యులంతా టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







