రాజా ది గ్రేట్ టీజర్.. టీజర్ విడుదల
- August 15, 2017
మాస్ మహరాజ్ రవితేజ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. రవితేజ బ్లైండ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రాజా ది గ్రేట్ టీజర్ మాస్ మహ రాజ్ ఆడియెన్స్ కు బీభత్సంగా నచ్చేసింది.
ఐయాం బ్లైండ్ బట్ ఐయాం ట్రైనెడ్ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఒక్కటి చాలు సినిమాలో మాస్ మహరాజ్ క్యారక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి. పటాస్, సుప్రీం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న రాజా ది గ్రేట్ సినిమాలో మెహెరిన్ హీరోయిన్ గా నటిస్తుంది.
సాయి కార్తిక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా టీజర్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో వస్తున్నాడు. రవితేజ లుక్ కూడా కొత్తగా ఉంది. మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
టీజర్ తో ఇండిపెండెన్స్ డే శుభాకాక్షలు తెలిపాడు రవితేజ. త్వరలో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్న ఈ సినిమాతో పాటుగా రవితేజ విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడు సినిమా కూడా సెట్స్ మీద ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







