చెప్పినట్లే.. ప్రసంగాన్ని ముగించిన ప్రధాని మోదీ
- August 15, 2017
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై దేశ ప్రజలకు ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకున్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. ముందు చెప్పినట్లే తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు. గత నాలుగేళ్లలో మోదీ ప్రసంగం తక్కువ సమయంలో ముగియడం ఇదే మొదటిసారి.
గత నెలలో 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం సందర్భంగా మోదీ.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఎక్కువ సమయం కొనసాగుతోందని పలువురు తనకు ఉత్తరాల ద్వారా ఫిర్యాదు చేశారని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఈసారి తన ప్రసంగాన్ని గంటలోపే ముగిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే తన ప్రసంగాన్ని 54 నిమిషాల్లో ముగించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోదీ 2014లో 65 నిమిషాలు ప్రసంగిస్తే.. 2015లో 86 నిమిషాలు, గత ఏడాది 94 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సారి మోదీ ప్రసంగంపై ప్రజల నుంచి 8 వేలకుపైగా సూచనలు, సలహాలు అందినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







