తెలంగాణలో ఇకపై పాతబండి కొంటే.. నమోదు చేయాల్సిందే
- August 15, 2017
14 రోజుల్లోగా కొనుగోలుదారు స్పందించాలిహైదరాబాద్: నిత్యం వందలాది వాహనాలు చేతులు మారుతుంటాయి. కానీ, వాటి వివరాలు రవాణాశాఖ వద్ద నమోదవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడో, నిబంధనలు అతిక్రమించిన సందర్భాల్లోనో ఆ వాహనం వివరాల గురించి వెతికితే పాత యజమాని వివరాలే వస్తున్నాయి. దీంతో చాలాసార్లు వాళ్ల మీద కేసులు నమోదతుంటాయి.. లేదా చలానాలు వారికే వెళ్తుంటాయి. అప్పుడు వాళ్లు లబోదిబోమంటూ అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. యాజమాని మారిన విషయాన్ని రవాణాశాఖ వద్ద నమోదు చేసుకోకపోవడంతో మరో సమస్య కూడా వస్తోంది. నేరగాళ్లు ఇలాంటి బినామీ వాహనాలతో రెచ్చిపోతుంటారు. ఈ వ్యవహారాన్ని ఇక మీదట కొనసాగనివ్వకూడదని తెలంగాణ రవాణా శాఖ నిర్ణయించింది. కొనుగోలుదారులు వెంటనే ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోడానికి ఆసక్తి చూపడంలేదు కనుక ఇకమీదట వాహనాన్ని అమ్మిన వెంటనే విక్రయదారుడు ఆ వివరాలను రవాణాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసే అవకాశం కల్పించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ నెలాఖరులోగా అందుబాటులోకిఏదైనా వాహనాన్ని అమ్మిన వ్యక్తి ఆ పత్రాలను మా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మేం కొనుగోలుదారును గుర్తించి.. వెంటనే దానిని రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా అప్రమత్తం చేయడానికి వీలుంటుంది. మా వెబ్సైట్లో వివరాలు నమోదు కాగానే వారి ఫోన్ నంబరుకు సందేశం పంపిస్తాం. ఏవైనా ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు లేదంటే చాలానా జారీ అయిన సందర్భాల్లోనూ ఈ పత్రాలు కీలకంగా మారతాయి.
ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నాం. ఈనెల చివరిలోగా అది అందుబాటులోకి వచ్చే అవకాశముంది.- జె.పాండురంగ నాయక్, రవాణాశాఖ సంయుక్త కమిషనర్అమ్మినవాళ్లు ఏం చేయాలి?అమ్మకందారు రవాణాశాఖ ఫామ్- 29, 30 పత్రాలపై కేవలం సంతకాలు చేసి ఇచ్చేయడం కాకుండా వాటి కాపీలను రవాణాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.వాహనం కొన్నవారి వివరాలు, మొబైల్ నంబరు వాటిలో పొందుపరచాలి.అమ్మినవాళ్లు, కొన్నవాళ్ల ఆధార్ కార్డు వివరాలు కూడా ఇవ్వాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







