త్వరలో ఎన్టీఆర్ తో చంద్రశేఖర్ యేలేటి
- August 15, 2017
చంద్ర శేఖర్ ఏలేటి.. విలక్షణ దర్శకుడు.. బుల్లితెర నుంచి వెండి తెరపై అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమాను తెరకెక్కించాడు. అందరూ కమర్షియల్ సినిమా మత్తులో ఉన్న సమయంలో "ఐతే", అనుకోకుండా ఒక రోజు వంటి థ్రిల్లర్స్ ను తెరకెక్కించాడు. అప్పట్లోనే విలక్షణం గా ఆలోచించి సాహసోపేతమైన సినిమాలను తెరకెక్కించిన చంద్ర శేఖర్ తాను తెలుగు దర్శకుల్లో చాలా ప్రత్యేకం అని చెప్పకనే చెప్పాడు.. కాలం కంటే ముందుగా ఆలోచించిన యెలేటి సినిమా అప్పట్లో కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు కానీ.. గత మూడు నాలుగు ఏళ్లుగా టాలీవుడ్ కొత్త జోనర్ లో సినిమాల బాట పట్టింది కనుక ఇప్పుడు చంద్ర శేఖర్ ఓ సరికొత్త కధతో మంచి హీరోతో ప్రేక్షకుల ముందుకొస్తే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ఏ నేపద్యంలో టాలీవుడ్ లో తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. జూ. ఎన్టీఆర్ చంద్ర శేఖర్ ఏలేటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్నది. డిఫరెంట్ సినిమా కధలతో వరస హిట్స్ తో జోరు మీదున్న తారక్.. డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించే యెలేటి కి అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యాడట.. ఈ అవకాశం కనుక చంద్ర శేఖర్ ఉపయోగించుకొని మంచి కధ తో తెరకెక్కిస్తే.. ఆ సినిమా ఇద్దరికీ ఓ మంచి సినిమాగా మిగలడం ఖాయం అని అంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







