బహ్రెయిన్‌లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- August 16, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

71వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బహ్రెయిన్‌లోని భారత కమ్యూనిటీ మెంబర్స్‌, ఇండియన్‌ మిషన్‌ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. భారత రాయబారి అలోక్‌ కుమార్‌ సిన్హా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గడచిన 70 ఏళ్ళలో భారతదేశం వివిధ రంగాల్లో సాధించిన విజయాల గురించి ఈ సందర్భంగా రాయబారి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇండియన్‌ ఎంబసీ ఫస్ట్‌ సెక్రెటరీ మీరా సిసోడియా, సెకెండ్‌ సెక్రెటరీ ఆనంద్‌ ప్రకాష్‌, ఇండియన్‌ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు, వారి కుటుంబాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌, బహ్రెయిన్‌ కేరళీయ సమాజం, కేరళ కేథలిక్‌ అసోసియేషన్‌ సహా పలు ఆర్గనైజేషన్స్‌ కూడా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి. దేశభక్తి గీతాల ఆలాపన సహా పలు సాంస్కృతిక కార్యక్రమాల్ని ఈ సందర్భంగా నిర్వహించారు. అలాగే జీసీసీ వ్యాప్తంగా వివిధ దేశాల్లో భారతీయ వలసదారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈజిప్ట్‌, యూఏఈ సహా పలు దేశాల్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com