తమిళ హీరో అజిత్‌ అభిమానులకు మరో శుభవార్త

- August 17, 2017 , by Maagulf
తమిళ హీరో అజిత్‌ అభిమానులకు మరో శుభవార్త

నటుడు అజిత్‌ నటించిన వివేగం చిత్రం టీజర్‌ను సామజిక మాధ్యమాల ద్వారా పంచుకొని ఆనందంలో మునిగిపోయిన ఆయన అభిమానులకు ప్రస్తుతం మరో శుభవార్త అందింది. ఆ చిత్రం ట్రైలర్‌ త్వరలో విడుదల కానున్నట్లు వెల్లడైంది. ఈ చిత్రం ఎడిటర్‌ రూపన్‌ మాట్లాడుతూ... ఇప్పటికే 'ట్రైలర్‌' తయారీ పనులు పూర్తయ్యాయని చెప్పారు. దానిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సదరు తేదీ వివరాలను దర్శకుడు శివ ప్రకటిస్తారన్నారు. ఈ చిత్రం టీజర్‌ను అజిత్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకొని అది రికార్డు సృష్టించడానికి కారణమయ్యారు. ఈ పరిస్థితుల్లో ట్రైలర్‌ కూడా రికార్డు సృష్టిస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేస్తారో లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది. థియేటర్లలోకి రాకముందే ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేయడం విశేషం. తమిళనాట థియేటర్ల విడుదల హక్కుల ద్వారా రూ.55 కోట్లు, విదేశాల్లో రూ.10 కోట్లు, తెలుగులో విడుదలకు రూ.4 కోట్లు, శాటిలైట్స్‌ హక్కులకు రూ.23 కోట్లు వచ్చినట్లు తెలిసింది. సినిమా నిర్మాణానికి రూ.80 కోట్లు మాత్రమే అయిందని సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com