తమిళ హీరో అజిత్ అభిమానులకు మరో శుభవార్త
- August 17, 2017
నటుడు అజిత్ నటించిన వివేగం చిత్రం టీజర్‌ను సామజిక మాధ్యమాల ద్వారా పంచుకొని ఆనందంలో మునిగిపోయిన ఆయన అభిమానులకు ప్రస్తుతం మరో శుభవార్త అందింది. ఆ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానున్నట్లు వెల్లడైంది. ఈ చిత్రం ఎడిటర్ రూపన్ మాట్లాడుతూ... ఇప్పటికే 'ట్రైలర్' తయారీ పనులు పూర్తయ్యాయని చెప్పారు. దానిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సదరు తేదీ వివరాలను దర్శకుడు శివ ప్రకటిస్తారన్నారు. ఈ చిత్రం టీజర్‌ను అజిత్ అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకొని అది రికార్డు సృష్టించడానికి కారణమయ్యారు. ఈ పరిస్థితుల్లో ట్రైలర్ కూడా రికార్డు సృష్టిస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేస్తారో లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది. థియేటర్లలోకి రాకముందే ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేయడం విశేషం. తమిళనాట థియేటర్ల విడుదల హక్కుల ద్వారా రూ.55 కోట్లు, విదేశాల్లో రూ.10 కోట్లు, తెలుగులో విడుదలకు రూ.4 కోట్లు, శాటిలైట్స్ హక్కులకు రూ.23 కోట్లు వచ్చినట్లు తెలిసింది. సినిమా నిర్మాణానికి రూ.80 కోట్లు మాత్రమే అయిందని సమాచారం.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







