ఒమాన్ ఏర్‌పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్ల కొత్త మీటర్ల వినియోగానికి నిరాకరణ

- October 23, 2015 , by Maagulf
ఒమాన్  ఏర్‌పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్ల కొత్త మీటర్ల వినియోగానికి నిరాకరణ

కొత్త మీటర్ల వినియోగానికి ఒమాన్  ఏర్‌పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్ల నిరాకరణ

ఏర్‌పోర్ట్ వద్ద తమ వ్యాపారంపై తమకు గుత్తాధిపత్యం కావాలని కోరుతూ, అక్కడి ఏర్‌పోర్ట్ ట్యాక్సీ డ్రైవ ర్లు కొత్త మీటర్ల వినియోగానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఏ వాహనాన్నైనా ఎవరైనా, ట్యాక్సీ గా వినియోగించగలుగుతున్నారని, అలాకాకుండా ఆరేంజ్ ట్యాక్సీ లను, ప్రవాసీయులు తమ స్వంత వాహనాలను ట్యాక్సీలుగా వినియోగించడాన్ని వెంటనే నిరోధించాలని అంతవరకూ కొత్త మీటర్లను అనుమతించబోమని, ట్యాక్సీ డ్రైవర్ల ప్రతినిధి - అబ్దుల్లా  అల్ షిబ్లి డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా, ట్యాక్సీ డ్రైవర్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, ఈ నిర్ణ యం మస్కట్ మునిసిపాలిటీ వారిచే 2012 లో ఆమోదించబడిందని, మొదటి దశలో ఐర్‌పోర్టుల ట్యాక్సీ లకు మీటర్లు బిగించామని, క్రమంగా మస్కట్ లోని హోటెల్ మరియు రీసార్ట్ ట్యాక్సీలకు, అనంతరం అన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ట్యాక్సీ లకు వర్తింపజేస్తామని మునిసిపల్ కౌన్సిల్ మెంబర్ - సలీమ్ అల్ ఘమ్మారీ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com