రెండ్రోజులపాటు రోడ్డు మూసివేత

- August 17, 2017 , by Maagulf
రెండ్రోజులపాటు రోడ్డు మూసివేత

పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ రెండ్రోజులపాటు అల్‌ అయిన్‌ అబితబీబ్‌ స్ట్రీట్‌ - డి రింగ్‌ రోడ్‌ నుంచి సి రింగ్‌ రోడ్డు వైపు మార్గాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌తో కలిసి మూసివేతపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. రోడ్డు తాత్కాలిక మూసివేత కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌ పోలీసులు సూచించిన మేరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నెమ్మదిగా తమ వాహనాల్ని నడపాలని అధికారులు సూచించారు. వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితిని అర్థం చేసుకోవాలని అష్గల్‌ విజ్ఞప్తి చేసింది. ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనుల నిమిత్తం ఈ తాత్కాలిక మూసివేతను అమలు చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com