నటి మంచు లక్ష్మి కొత్త సినిమాకు శ్రీకారం

- August 18, 2017 , by Maagulf
నటి మంచు లక్ష్మి కొత్త సినిమాకు శ్రీకారం

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. విజయ్‌ యలంకంటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మంచు మనోజ్‌, ఆయన భార్య ప్రణతి, మంచు లక్ష్మి తనయ విద్యా చిత్ర నిర్మాణ స్క్రిప్ట్‌ను దర్శక నిర్మాతలకు అందించారు. నటి, నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడుతూ కొంత విరాం తర్వాత మా సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఓ యువతి కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఎమోషన్స్‌, రిలేషన్‌షిప్స్‌ చుట్టూ కథంతా తిరుగుతుంది. మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని చెప్పారు. ఈ చిత్ర ప్రారంభ విశేషాలు ఈ వీడియో ద్వారా చూడండి..
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com