విడుదలకు సిద్ధంగా ఉన్న'వివేగం'
- August 18, 2017
దర్శకుడు శివ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'వివేగం'. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాణిజ్య పనులు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. 2.24 నిమిషాల పాటు సాగే ఈ ట్రైలర్లో చాలా సన్నివేశాల్లో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలు కనిపిస్తున్నాయి. 'నేను ఎవరనేది.. ఎదుటివాడిని బట్టే ఉంటుంది..' అంటూ అజిత్ చెప్పే ప్రారంభ డైలాగు ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 'బిల్లా 2'లో 'ఒవ్వొరు నాలుం.. ఎన్ వాళ్క్కయ నానా సెదుక్కనదుడా' వంటి డైలాగు మాదిరిగానే ఇది కూడా ఆసక్తిగా ఉంది. అలాగే ట్రైలర్లో రొమాంటిక్ సన్నివేశానికి కూడా చోటు కల్పించారు శివ. అనిరుధ్ సంగీతం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. మొత్తానికి ట్రైలర్ విడుదలైన 18 గంటల్లో ఏకంగా 40 లక్షల మంది వీక్షించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై కేరళలోనూ అంచనాలు పెరిగాయి.
దాదాపు 300 లకు పైగా థియేటర్లలో దీనిని విడుదల చేయనున్నారు. 'బాహుబలి 2' తర్వాత అంతటి సంఖ్యలో విడుదలవుతున్న సినిమా 'వివేగం' కావడం విశేషం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









