" శోభన్ బాబు " చిత్రం ముహూర్త పూజ

- October 23, 2015 , by Maagulf

తెలుగు వారి ప్రియతమ అందాల కథానాయకుడు .ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వెండితెర సోగ్గాడు , ఇప్పుడు ఆయన పేరు మీద ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది .. సాలగ్రామ్ పతాకం పై విప్లవ్ .కె నిర్మాణ దర్శకత్వంలో ,అలా ఎలా ,టైగర్ విజయాల తరువాత రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం " శోభన్ బాబు " విజయ దశమి పండుగ పురష్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త పూజ కార్యక్రమాలు ఫిలింనగర్ ఆఫీస్ లో జరిగాయి . అన్ని వర్గాలను అలరించే ఒక రొమాంటిక్ కామెడీగా రుపొందబోతున్న చిత్రానికి విజయం కలగాలని ఆ యూనిట్ సభ్యులు పూజలందించారు.. రాహుల్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ రెండో వారంలో ఉంటుందని సంగీతం రమణగోగుల అందిస్తున్నారని దర్శక నిర్మాత విప్లవ్ తెలిపారు .. ఈ చిత్రానికి సంగీతం : రమణ గోగుల, ఛాయాగ్రహణం : భరణి.కె.ధరన్, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, సాహిత్యం :భాస్కరబట్ల, కళ : ధర్మేంద్ర , కాస్ట్యూమ్ డిజైనర్ : దేవి ఐశ్వర్య , కో-డైరెక్టర్: యపాటి రమేష్ నాయుడు, లైన్ ప్రొడ్యూసర్ : చ .హ .వ . స .న  బాబ్జీ నిర్మాణం :సాలగ్రామ్ సినిమా(సాలగ్రం  సినిమా ) రచన-దర్శకత్వం : విప్లవ్ .కె

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com