బకాయి పడిన జీతం కోసం నిర్మాణ సంస్థ కార్మికులు నిరసన
- August 18, 2017
ఒక నిర్మాణం సంస్థకు చెందిన 50 మంది ఉద్యోగులు తమకు బకాయి పడిన జీతాలనుతక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆండలూస్ గార్డెన్ లో నిరసన వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ నుంచి కంపెనీలో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులకు యాజమాన్యం వేతనాలను చెల్లించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న ఒక ఉద్యోగి జగన్, " మా గల్ఫ్ డాట్ కామ్ " న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తాము పనిచేసే కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు తప్పుగా మంత్రిత్వ శాఖకు నివేదిక అందచేసిందని.. అయితే ఎంత మాత్రం నిజం కాదని ఆయన చెప్పారు, కేవలం ముప్పై మంది బహ్రెయిన్ ఉద్యోగులకు మాత్రమే జీతాలను చెల్లించారు. ప్రవాసీయులు ఎవరికీ ఆ జీతాలు చెల్లించలేదన్నారు తాము పని చేస్తున్న నిర్మాణ సంస్థ మంత్రిత్వ శాఖకు, ప్రజలకు అబద్దంచెప్పారు. "మేము రోజూ ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. "మా భవిష్యత్తు నాశనం కాబడ్డాయి మరియు మా వీసాలు ఇప్పుడు గడువు ముగియనుందని చెప్పాడు. జగన్ తెలిపిన ప్రకారం, వారిలో అత్యధికులు 2016 లో నియమించబడ్డారు, ఆ కంపెనీ కొన్ని ప్రధాన ఒప్పందాలను పొందింది. అయితే రాబోయే ప్రాజెక్టులలో జాప్యం ఏర్పడిన ఫలితంగా సంస్థ "సరఫరాదారులకు జీతాలు చెల్లించలేకపోయింది" అని జగన్ పేర్కొన్నాడు. దీని ఫలితంగా కంపెనీ "ఖాతాదారులచే తొలగించబడినది" అని జగన్ అన్నారు. నిర్మాణ సంస్థ నవంబర్ నుండి పలువురికి జీతాలు చెల్లించనప్పటికీ, ఉద్యోగులు ఏప్రిల్ వరకు పని చేస్తూనే ఉన్నారు" అని జగన్ పేర్కొన్నారు. "డిసెంబరు నుండి ఏప్రిల్ వరకు మొత్తం ఐదు నెలల జీతాలు ఇప్పుడు సంస్థ వద్ద బకాయి పడి ఉన్నాయని ,కంపెనీ ఇప్పుడు తమ సమస్య గూర్చి సంభాషించడానికి సైతం నిరాకరించినట్లు ఆయన ఆరోపించారు. "మేము పూర్తిగా కారు చీకటిలో ఉన్నామని తెలియచేస్తూ "మేము కంపెనీ ద్వారా కూడా తొలగించబడలేదు.""మేము మా వేతనాల కోసం అడిగినప్పుడు వారు సమాధానం సైతం ఇవ్వడం లేదని జగన్ వాపోయాడు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







